కూకట్ పల్లి లో విషాద ఘటన…
తెలంగాణవీణ – కూకట్ పల్లి …. నిషేధిత చైనా మాంజ కారణంగా ఓ చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, ఓ ఐదేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో ద్విచక్రవాహనంపై వెళుతుండగా, పసి పాప బైక్ పైన ముందు కూర్చోవడంతో, చైనా మాంజ పాప గొంతు కు తగిలి కోసుకుపోయి చిన్నారి మృతి చెందిన హృదయ విదారక ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, ఈ ఘటన పై కూకట్ పల్లి ఎస్ హెచ్ ఓ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం, కూకట్పల్లి ,వివేకానంద నగర్ జాతీయ రహదారి పై బైక్ పై తన తల్లిదండ్రులతో పాటు వెళ్తున్న క్రమంలో బైక్ పై ముందు కూర్చున్న చిన్నారి నిష్విక దరియా(5) గొంతుకు చైనా మాంజా కోసుకొని అక్కడికక్కడే మృతి చెందింది. కేపిహెచ్బి గోకుల్ ఫ్లాట్స్ లో నివాసముండే ప్రేమసాగర్ దంపతులు, పఠాన్ చెరువు సమీపంలోని ఖాజీపల్లి గ్రామంలో ఇటీవల వారు తీసుకున్న ఇంటి వద్ద జరుగుతున్న, ఇంటీరియర్ పనులు చూసుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేపిహెచ్బి కాలనీలోని ఓ నగల దుకాణానికి వెళ్దామని అనుకొని, ఇంటికి వెళ్లకుండా ఇటువైపు వచ్చిన వారు, దానిని కూడా దాటి ముందుకు రావడంతో, యూటర్న్ తీసుకొని వెళ్దాం అనుకొని వస్తుండగా, పాప గొంతుకు చైనా మాంజా రూపంలో మృత్యువు కబలించింది. గొంతుకు మాంజా చుట్టుకోవడంతో పాప ఒక్కసారిగా బిగ్గరగా అరవడంతో, తండ్రి గమనించి చూసేసరికి తీవ్ర రక్తస్రావం కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు.ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని , మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని తెలిపిన పోలీసులు.





